రాష్ట్రీయం

పొత్తులపై త్వరలోనే స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఢిల్లీలో సీనియర్ నేతలతో కుంతియా, ఉత్తమ్ భేటీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కాంగ్రెస్ నుంచి టికెట్ రానివారు నిరాశ చెందవద్దని, అధికారంలోకి వచ్చిన తరువాత పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా వెల్లడించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీలను కలిసి పార్టీ పరిస్థితి, మహాకుటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించారు. ఇటీవలి కాలంలో మహాకూటమిలో ఉన్న తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి నాయకులతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, పొత్తుల ఖారారుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి గులామ్ నబీ ఆజాద్ మరింత స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటు, పొత్తుల ఖరారు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశం అనంతరం కుంతియా విలేఖరులతో మాట్లాడుతూ మహాకూటమిలో పార్టీల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితి నాయకుడు కోదండరాంతో మూడుసార్లు చర్చలు జరిపినట్టు తెలిపారు. ఈ నెల 20న రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తారని, త్వరలోనే సోనియాగాంధీ కూడా పర్యటించనున్నట్టు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని, పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. టికెట్ రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే పార్టీ లేదా ప్రభుత్వంలో పదపులిచ్చి న్యాయం చేస్తామని కుంతియా స్పష్టం చేశారు.