జాతీయ వార్తలు

భారతీయ రైల్వేల్లో అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారతీయ రైల్వేల చరిత్రలో మరో అరుదైన ఘటన ఆవిష్కృతం కానుంది. దేశంలోనే తొలిసారి టనె్నల్ లోపల రైల్వే స్టేషన్ రానుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో సొరంగంలో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించతలపెట్టారు. సొరంగం లోపల 3000 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. బిలాస్‌పూర్- మనాలీ లెహ్ లైన్‌లో ఏర్పాటుచేసిన ఈ కొత్త స్టేషన్ చైనా-ఇండియా సరిహద్దుకు దగ్గర్లో ఉంది. ఈ విషయాన్ని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. దేశంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో మెట్రో స్టేషన్లు సొరంగంలోనే నిర్మించారు. అయితే తొలిసారి కీలాంగ్ రైల్వేస్టేషన్ హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మితమవుతోంది. లాహౌల్, స్పిటి జిల్లాకు కీలాంగ్ పరిపాలనా కేంద్రంగా ఉంది. ఇది మనాలీకి ఉత్తరంగా 26 కిలోమీటర్లు, ఇండో-టిబెట్ సరిహద్దుకు 120 కిలోమీటర్ల దూరలో ఉంది. ‘కీలాంగ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే సర్వే పనులు ప్రారంభమయ్యాయి’అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజనీర్(కన్‌స్ట్రక్షన్) డీఆర్ గుప్తా వెల్లడించారు. 27 కిలోమీటర్ల సొరంగంలో నిర్మిస్తున్న ఈ స్టేషన్ నిజంగా అద్భుతమేనని ఆయన అన్నారు. ఈ మార్గం పూర్తయిందంటే బిలాస్‌పూర్ నుంచి లెహ్‌ను కలుపుతుంది. సుందర్ నగర్, మండీ, మనాలీ, కీలాంగ్, కోక్సార్, దర్ఛా, ఉప్షీ, కరు పట్టణాలను కలుపుతుంది. అంతేకాదు హిమాచల్- జమ్మూకాశ్మీర్ పట్టణాలకు అందుబాటులో ఉంటుంది. మొత్తం ఈ ప్రాజెక్టులో 74 టనె్నల్స్, 124 భారీ వంతెనలు, 396 చిన్న వంతెనలు నిర్మిస్తారు. ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ-లెహ్ మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. ప్రస్తుతం 40 గంటల ప్రయాణం 20 గంటలకు తగ్గిపోతుందని జీఎం విశే్వష్ దూబే తెలిపారు.