రాష్ట్రీయం

ఇక నవ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషన్ భగీరథ పేరు వింటే కాంగ్రెస్ కంగారుపడుతోంది. పథకం అమలుకు హడ్కో ద్వారా రుణం పొందుతుంటే, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారు. ఇదేనా పద్ధతి? రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం కలిగిస్తారా?. ఎంపీ పంపిన లేఖను హడ్కో ఎండి నాకు పంపించారు. ఎవరడ్డొచ్చినా ఆగేది లేదు. పథకాలను ఆపేది లేదు. ఆరు నూరైనా మిషన్ భగీరథ అమలుచేసి చూపిస్తాం.

================
పునర్నిర్మాణానికి పునాదులేస్తున్నా
ఎవరడ్డొచ్చినా ఆగేది, ఆపేది లేదు
గోలచేసే వాళ్లకు పని చేసి చూపిస్తా
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు
10వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
ముస్లిం రిజర్వేషన్ల హామీపై వెనక్కితగ్గను
మిషన్ భగీరథకు భయపడుతున్న కాంగ్రెస్
అసెంబ్లీలో సిఎం కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం
=================

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ కోణంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం బిగించామని, తెలంగాణ తననుతాను కొత్తగా ఆవిష్కరించుకోబోతోందని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక ప్రతి పనినీ తెలంగాణ కోణంలోనే చేపడతామన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చకు సిఎం కెసిఆర్ ఆదివారం రెండున్నర గంటలపాటు సుదీర్ఘ సమాధానమిచ్చారు. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఇరిగేషన్‌కు ఎలా నష్టం వాటిల్లిందో వివరించారు. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకం వినా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్ని అమలు చేశామన్నారు. వచ్చే పంచాయితీ ఎన్నికల్లో తండాలకు గ్రామ పంచాయితీలుగా ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారు.
మిషన్ భగీరథ పేరు వింటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని సిఎం విమర్శించారు. ఈ పథకం అమలుకు హడ్కో ద్వారా రుణం పొందుతుంటే, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారని సిఎం శాసన సభలో వెల్లడించారు. ఇదేనా పద్ధతి? రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం కలిగిస్తారా? అని నిలదీశారు. ఎంపీ పంపిన లేఖను హడ్కో ఎండి తనకు పంపించారన్నారు. ఆరు నూరైనా మిషన్ భగీరథ అమలుచేసి చూపిస్తామన్నారు. డిసెంబర్ 16నాటికి 6182 గ్రామాల్లో, 12 మున్సిపాలిటీల్లో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని ప్రయత్నించినా, కేంద్రంనుంచి ఆశించిన మద్దతు లభించలేదన్నారు. ఇప్పటికే 50శాతం రుణాలు చెల్లించామని, ఈసారి మిగిలిన 25శాతం చెల్లిస్తామన్నారు. ఇంకా 25శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయంగా దక్కే వాటాను ఉపయోగించుకుని నియోజకవర్గానికి లక్ష చొప్పున రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎవరు అడ్డుకున్నా, పంచాయితీలు పెట్టినా లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ కొత్త ఓరియంటేషన్‌తో ముందుకెళ్తోందని అన్నారు. పదివేల టీచర్ పోస్టుల నియామకం చేపడుతున్నట్టు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. ఇప్పటికే 18వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువరించామన్నారు. వచ్చే రెండేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెరాస ఎప్పుడూ ప్రకటించలేదని, అది ఆంధ్రలో తెదేపా నినాదమని, చట్టసభల్లో సభ్యులు తెలుసుకుని మాట్లాడాలని సిఎం సూచించారు. తెలంగాణకు ఇప్పుడు పునాది పడుతోందని, అన్నింటిని తెలంగాణ కోణంలో పునర్నిర్మించుకోవాలని అన్నారు. మహారాష్టత్రో కుదిరిన ఒప్పందం వల్ల గోదావరి జలాలను ఉపయోగించుకుని ప్రాజెక్టులను నిర్మించుకుందాం. 16 లక్షలు కాదు, అంత కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా సాగులోకి భూమి వస్తుందని సిఎం వెల్లడించారు. సమైక్య పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అంతర్ రాష్ట్ర వివాదాలు తలత్తేలా, అదీకాకపోతే పర్యావరణ అనుమతులకు అడ్డు తగిలేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని విమర్శించారు. ఎస్‌బి చవాన్, వెంగళరావు హయాంలోనే గోదావరి ప్రాజెక్టులపై ఒప్పందం కుదిరితే, ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరగలేదని సిఎం కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. తమ్మడి హట్టి ప్రాజెక్టు నిర్మాణానికి తాము ఒప్పందం కుదుర్చుకుంటే, కెసిఆర్ మహారాష్టక్రు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఎత్తు తగ్గించారని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర వ్యతిరేకిస్తున్నట్టు ఆ రాష్ట్ర సిఎం లేఖ రాశారని, దానికి అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బదులిచ్చారని అంటూ ఆ రెండు లేఖలను సభ్యులకు అందించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఖర్చు గంగలో పోసినట్టయ్యిందని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉండగా, ఎంత మొత్తుకున్నా వినకుండా ఆరువందల మంది సాయుధ పోలీసుల మధ్య పులిచింతల కట్టారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఐదు రేట్లు పెంచారన్నారు. అక్కడ పూర్తి కావడంతో గోదావరి జలాలలపై దృష్టి సారించారని అన్నారు. తెలంగాణకు సాగునీరు లభించే విధంగా కాకుండా తెలంగాణను ఎండ బెట్టి ఆంధ్రకు ప్రయోజనాలు కలిగేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు సమైక్యాంధ్ర పాలకులంతా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఒకేవిధంగా వ్యవహరించారని ఆగ్రహించారు. జలయజ్ఞం దేవునికి ఓట్ల నైవేద్యం పెడదామని జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో తనపై పోటీ చేసినప్పుడు గోడల మీద రాయించారని కెసిఆర్ గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణలో పుట్టి ఉండాల్సిందని అన్నారని చెప్పారు. మేం తెలంగాణకు అన్యాయం చేస్తామా? మహాష్టక్రు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టామా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ భజన చేసిన మీరు తెలంగాణ సోయిలేకుండా తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. 15 ఏళ్లపాటు కష్టాలు, అవమానాలు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం. తెలంగాణ సాధించాం. తెలంగాణ కోసమే పని చేస్తానన్నారు. ప్రజలు ఈ విషయం గ్రహించారు కనుకే ప్రతి ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తున్నారని, ఈ ఓట్లు ఊరికే వేసినవి కాదని, ఎవరేం చేస్తున్నారో గమనించే ప్రజలు గెలిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలతో సంయమనంతో వ్యవహరించి, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉన్నామన్నారు. ఈనెల 19న ఇంజనీర్లస్థాయిలో మహారాష్ట్ర తెలంగాణ అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని వెల్లడించారు. తమ్మిడి హట్టి ఎత్తు ఎంతో తాను చెప్పలేదని తెలిపారు. రెండు రాష్ట్రాల గోదావరి ప్రాజెక్టులపై బోర్డు ఏర్పాటుచేస్తూ ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినట్టు చెప్పారు. అధికారుల మధ్య చర్చల తరువాత తుదిరూపం వస్తుందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంపై రొటీన్ విమర్శలు తప్ప పెద్దగా సలహాలు ఇవ్వలేదన్నారు. 2009లో ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ఏ ఒక్కటీ అమలు చేయలేదని, తెరాస కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వినా మిగిలినవన్నీ అమలు చేసినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దశలవారీగా బిల్లులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో జిల్లాలో ఒక పెద్ద కంపెనీని బాధ్యత తీసుకోమని కోరినట్టు చెప్పారు. వివిధ పథకాల కింద రాష్ట్రంలో ప్రాజెక్టులు పొందిన బడా కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరినట్టు కెసిఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి సిఎం ధన్యవాదాలు తెలిపారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు.