జాతీయ వార్తలు

నక్సల్స్ మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్తర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మంగళవారం మెరుపుదాడి చేసి 9 మందిని బలిగొన్నారు. సుక్మా జిల్లా కిష్టారాం - పలోడి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను నక్సలైట్లు శక్తిమంతమైన మందుపాతరలతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సుక్మా జిల్లాలో ఈ దాడి జరిగింది. సుక్మాలోని కిస్టారమ్-పేలోడి రోడ్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకున్నది. మావోలతో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత భద్రతా బలగాలు సుక్మా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో బాంబులు పేలడంతో సీఆర్‌పీఎప్ జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలో 100 మంది మవోయిస్టులు పాల్గొన్నారని అంచనా.