Others

నీళ్లు రాని కళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందికి కళ్లు మండటం, పొడిబారటం, కనురెప్పలు అతుక్కుపోయి వుండటం, ఎర్రబడటం వంటి లక్షణాలు వస్తాయి. దానే్న ‘డ్రై’ ఐ అంటారు.
కంట్లో వివిధ గ్రంథులు వుంటాయి. అవి నీళ్ళు, మ్యూకస్ జిగురు పదార్థం, తైలాన్ని స్రవిస్తాయి. నీళ్ళు, జిగురు, నూనె ఈ మూడు పదార్థాలు కళ్ళు పొడిబారకుండా ఆపుతాయి.
కన్నీరు బాష్పీభవనం చెందకుండా నూనె ఆపుతుంది. ఇక మ్యూకస్ నీరుని కంటి పొరలపై ఎక్కువ సమయం వుండేలా చూస్తుంది. ఈ మూడు తగినంత నిష్పత్తిలో లేకపోతే, కన్ను పొడిబారటం ప్రారంభిస్తుంది. క్యారట్లు తినేవారిలో ‘పొడి కన్ను’ రాదు. క్యారట్లలో ‘విటమిన్ ఎ’ వుంటుంది. ‘విటమిన్ ఎ’ కంట్లో తైలాల్ని స్రవింపజేయడం కోసం ఉపయోగపడుతుంది.
తరచూ కంప్యూటర్‌తో పనిచేసేవాళ్ళలో... ఈ కళ్ళు పొడిబారటం వుంటుంది. ఎర్రబడటం కూడా.. దీనే్న ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అంటారు. కంప్యూటర్‌కి యువి కిరణాల షీల్ట్ గాని, ప్రతి పది నిమిషాలకు తల పక్కకి తిప్పటం చేస్తూ వుంటే డ్రై ఐ రాదు. కొన్ని రకాల కీళ్ల వ్యాధులు.. చర్మవ్యాధుల్లో.. ఎలర్జీ కండిషన్లలో కన్ను పొడిబారుతుంది. ‘జోగ్రన్ సిండ్రోమ్’ అంటారు దీన్ని. పొడికన్ను తెల్లగ్రుడ్డువల్లా.. నల్లగ్రుడ్డువల్లా కూడా రావచ్చు. నొప్పితో వస్తే అది నల్లగ్రుడ్డువల్ల వచ్చినట్లు...
కన్నీళ్లలో ‘లైసోజైమ్’ అనే ఎంజైమ్ వుంటుంది. ‘డ్రై ఐ’లో అది పోతుంది. ‘డ్రై ఐ’కి సాధారణంగా కృత్రిమ కన్నీటి బిందువులు వాడతారు. ఈ ఆర్ట్ఫిషియల్ టియర్‌డ్రాప్స్ వేసుకుంటే పొడికన్ను బాధ వుండదు. కార్టికోస్టిరాయిడ్ డ్రాప్యూ వాడతారు.‘డ్రై ఐ’ని త్వరగా ట్రీట్ చెయ్యకపోతే కన్ను దెబ్బతినే ప్రమాదం వుంది.

-డా కె.శివసుబ్బారావు