Others

నీలోను నాలోను ఉన్నది ఒక్కటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలువైపుల అద్దాలున్న గదిలోకి మనం ప్రవేశించినపుడు అన్ని అద్దాలలో కన్పిస్తున్న ప్రతిబింబం మనదేనని తెలుసుకొని చిరునవ్వుతో బయటకు వస్తాం. ఇంకాస్త సరదాకలిగితే జేబులోని దువ్వెన తీసి తల దువ్వుకుంటాం. ముఖాన్ని చూచుకుని మురిసిపోతాం. కాని అదే గదిలోకి ఒక కుక్క ప్రవేశిస్తే తనచుట్టూ వేరే కుక్కలున్నాయని తనతో వైరానికి వచ్చాయని మొరగడం మొదలుపెడుతుంది. అద్దాలపైకి ఎగిరెగిరి పడుతుంది. అన్ని దర్పణాల్లో దర్శనమిస్తున్నది తన ముఖమేనని తెలియక పోవడంవల్ల కుక్క పడే అవస్థలవి. ఈ ప్రపంచమనే అద్దాల సౌధంలో కనిపిస్తున్న ముఖాలన్నీ తనవేనని తెలియక మనుష్యులు కూడా చాలాసార్లు శునకంలాగే సహనాన్ని కోల్పోయి స్పర్ధలతో మరిగిపోతుంటారు. అందుకే శ్రీమద్భాగవతంలో పోతన ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి
...........నిశాచరాగ్రణి!
తండ్రీ! రాక్షసరాజా! ఈ మానవులందరు అజ్ఞానులు అవివేకులు. వీరందరూ ఈ సంసారమనే నూతిలోనించి బయటపడలేరు. మీరు- మేమనే భేదభావనలతో, భ్రమలలో బ్రతుకుతుంటారు. అలా భావించక ఇదంతా ఆ పరమాత్ముని లీలావిలాసమని తెలుసుకొని ఆ విష్ణువును స్మరిస్తూ సంపదల త్యజించి అడవిలో నివసించినా మేలే కదా! అంటాడు ప్రహ్లాదుడి ముఖతా.
ఆవేశకావేశకాలను, వైషమ్యాలను నిగ్రహించుకోవడం నాగరిక లక్షణం. ప్రతి ఉద్రేకాన్ని క్షణంకూడా నియంత్రించుకోలేక విరుచుకుపడడం మృగలక్షణం. కానీ దురదృష్టవశాత్తు నేడు మానవ జాతిలో ఈ మృగతత్వం నానాటికి పెచ్చుమీరుతున్నది. అందుకే సంయమనం కోల్పోయి నేరాలకు, ఘోరాలకు పాల్పడే నరరూప రాక్షసులు ఎక్కువయ్యారు. భారతంలో- అందరిలోను శ్రీకృష్ణపరమాత్మనే దర్శిస్తూ ధర్మమూర్తిగా వెలిగాడు యుధిష్ఠిరుడు. ఆ కృష్ణ్భగవానుడినే వైరిపక్షపు వ్యక్తిగా భావిస్తూ, దూషిస్తూ పతనమయ్యాడు దుర్యోధనుడు. ఒకరు అందరిలో భగవంతునే దర్శిస్తే మరొకడికి భగవంతుడిలోను శతృవే కన్పించాడు.
మనం కలహించి, ద్వేషించి, పగవారని, శాశ్వతంగా దూరంచేసుకున్న వారితోనే మనకు ఎన్నో అవసరాలు కలుగుతుంటాయి. కనుక పగతో ఎవ్వరినీ దూరం చేసుకోరాదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తల్లి దేవహూతికి జ్ఞానబోధ చేస్తూ-
అన్ని ప్రాణుల పట్ల గౌరవ, వాత్సల్యభావాలను చూపుతూ భిన్నదృష్టి లేకుండా అన్నీ ప్రాణులలోను ననే్న ఆరాధించు. అన్నీ జీవుల హృదయాలలో గుడి కట్టుకున్న ఏకైక ఆత్మను నేనే అని పరమాత్మ స్వయానా అన్నాడు. దైనందిన జీవితంలో, నిత్య వ్యవహారాలలో వ్యక్తి-వ్యక్తి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినపుడు వాటిని వ్యక్తిగత వైరాలుగా మార్చుకోక, పరస్పర దీర్ఘకాల దూషణలకు దిగక అనాగరిక స్థాయికి దిగజారక. పెద్ద మనసుతో సున్నితంగా పరిష్కారం చేసుకోవటం సజ్జనుల లక్షణం. పరులను పల్లెత్తు మాట అనేటప్పుడల్లా పరమాత్మ చెప్పిన మాటను స్మరించుకొని దూషణని గ్రహించుకోవాలి. ప్రతీకారం తీర్చుకోగల సామర్థ్యం వున్నా, సౌమ్యత్వాన్ని, క్షమాగుణాన్ని ప్రదర్శించడం ధీరుల లక్షణం. అలాంటి సౌమ్యమూర్తులే ఈ భువిపై నడయాడే దేవతామూర్తులు కాగలరు.

- కె.లక్ష్మి