జాతీయ వార్తలు

నీట్‌పై తీర్పిచ్చాక ఆర్డినెన్సా : సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నీట్’ను సంవత్సరం పాటు వాయిదావేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాదినుంచి నీట్ నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదని, సుప్రీం తీర్పును అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచరాణ జరిపింది. కేంద్రం చర్య తమకు రుచించలేదని వ్యాఖ్యానించింది. అయినా ఆ ఆర్డినెన్స్ నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని వ్యాఖ్యానించింది.