జాతీయ వార్తలు

‘నీట్’పై రివ్యూ పిటిషన్ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ‘నీట్’ (జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష)ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘నీట్’పై గురువారం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈరోజు తిరస్కరించింది. ముందు ప్రకటించినట్లు రెండు విడతలుగా పరీక్ష జరపాలని ఆదేశించింది. రెండు విడతలకు బదులు జూలై 24న ఒకేసారి పరీక్ష జరిపేందుకు అనుమతించాలని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చేసిన అభ్యర్థను కూడా కోర్టు త్రోసిపుచ్చింది. ‘నీట్’ను నిర్వహించేలా రాష్ట్రాలు తమ ఎంట్రన్స్‌లను వాయిదా వేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.