నెల్లూరు

లంచం కేసులో హెడ్మాస్టర్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్ మార్చి 17: బిఇడి విద్యార్థులు బాగా బోధించారని సర్టిఫై చేయటానికిగాను లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని నమోదు అయిన కేసులో వింజమూరు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ హెడ్మాస్టర్ మాదాల బుజ్జయ్యపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు ఎసిబి కోర్టు స్పెషల్ జడ్జి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బిఇడి విద్యనభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు సంబంధిత విద్యార్థులకు బోధించడానికి తమ కోర్సులో భాగంగా వింజమూరు హైస్కూల్‌కు వచ్చారు. అక్కడ బిఇడి విద్యార్థులు సక్రమంగా పాఠాలు బోధించారని నిందితుడైన హెడ్మాస్టర్ ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంది. బిఇడికి చెందిన 13 మంది విద్యార్థులు తమ నెల రోజుల టీచింగ్ పీరియడ్ పూర్తయిన తరువాత తమకు సర్ట్ఫికెట్ మంజూరు చేయాలని వారు నిందితుడైన హెడ్మాస్టర్‌ను కోరారు. దానికి మంజూరు చేయటానికిగాను రూ. 6,500 లంచంగా ఇవ్వాలని ఆయన బిఇడి విద్యార్థులను కోరారు.ఈ విషయం నచ్చని విద్యార్థి కె శ్రీనివాసులు జరిగిన సంఘటనను ఎసిబికి ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో 2013 మార్చి 16న తన కార్యాలయంలో బిఇడి విద్యార్థుల నుంచి లంచం పైకం స్వీకరించిన నిందితుడైన హెడ్మాస్టర్ బుజ్జయ్యను ఎసిబి పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈమేరకు నిందితుడిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పిపి పివి సుబ్బయ్య వాదించారు.