నెల్లూరు

ఉచిత ఇసుకపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నరీతిలో ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక రవాణాలో ఎలాంటి సమస్యలు లేకుండా అందరికి అందేలా పటిష్టమైన చర్యలు తీసుకుని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ సమన్వయంతో ఉచిత ఇసుక రవాణా ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక రవాణాపై వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నందున ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఉచిత ఇసుక రవాణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసి అమలుచేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రజలందరికి పటిష్టంగా అమలుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలు జరగకుండా ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా జిల్లాల సరిహద్దుల ప్రాంతాల వద్ద అవసరమైన చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలపై కేసులు నమోదుచేసి తగిన జరిమానాలు విధించాలన్నారు. ఈప్రక్రియలో పోలీసు, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. కలెక్టర్ ఎం జానకి మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది రీచ్‌ల నుండి ఉచిత ఇసుక రవాణా ప్రక్రియ జరుగుతోందన్నారు. అలాగే 22 ఇసుక రీచ్‌లను గుర్తించి నోటిఫై చేశామన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న తడ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు, అక్రమ ఇసుక రవాణా తరలించే 20 వాహనాలను సీజ్‌చేసి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల అధికారుల సమన్వయంతో కమిటీలను వేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌పి విశాల్ గున్ని, జిల్లా ప్రజాపరిషత్ సిఇఓ బి రామిరెడ్డి, మైనింగ్ విజిలెన్స్ అధికారి రామచంద్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.