నెల్లూరు

కావలిలో శేషాద్రికి హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేకపాటి, ఎమ్మెల్యే రామిరెడ్డి
కావలి, మార్చి 17: కావలి ప్రజలు, రైలు ప్రయాణికుల చిరకాల కోరిక మేరకు ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గురువారం కావలి రైల్వేస్టేషన్‌లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రెండు నిమిషాలపాటు నిలిచింది. ఇందుకోసం పలువురు నాయకులు కృషిచేయగా, నెల్లూరు పార్టమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు గట్టిగా కృషిచేశారు. గురువారం తొలిసారిగా దానిని కావలిలో నిలపగా వారిద్దరూ అందులో నెల్లూరు నుంచి ప్రయాణించి కావలి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల కావలి ప్రజల పోరాట ఫలితమని చెప్పారు. శబరి, యశ్వంత్‌పూర్, పద్మావతి తదితర రైళ్లను కూడా నిలుపుదల చేసేందుకు కృషిచేస్తామని అన్నారు.దక్షణ మధ్య రైల్వేలో ఆదాయపరంగా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న కావలి స్టేషన్‌లో మిగిలిన రైళ్లను కూడా ఆపాలని కోరారు. వ్యాపార పరంగా వందలాది మంది వ్యాపారులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని, అటు ఒంగోలుకు, ఇటు నెల్లూరుకు వెళ్లి అక్కడినుంచి ప్రయాణించాలంటే కష్టతరమన్నారు. తాము కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి మిగిలిన వాటిని నిలిపేందుకు కృషిచేస్తామన్నారు. రైల్వే పరంగా రాష్ట్రానికి ఆశించిన మేర న్యాయం జరగలేదని అన్నారు. వారివెంట నాయకులు మనె్నమేల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, కనుమర్లపూడి నారాయణ, కుందుర్తి శ్రీనివాసులు, పందిటి కామరాజు, గందం ప్రసన్నాంజనేయులు, నున్నా వెంకట్రావుతోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.