నెల్లూరు

బాధ్యతలు స్వీకరించిన అదనపు ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 17: జిల్లా నూతన అదనపు ఎస్పీగా బి.శరత్‌బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమండ్రి అర్బన్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఈయన నెల్లూరు అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవంతో జిల్లాపై తనకు అవగాహన ఉందన్నారు. గతంలో నెల్లూరు ఎసిబిలో డిఎస్పీగా, నగరంలోని బాలాజీనగర్ సిఐగా తాను పనిచేసినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, ప్రజల సహకారంతో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన జిల్లా ఎస్పీ విశాల్ గున్నిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అదనపు ఎస్పీని కలసిన పోలీస్ సంఘ సభ్యులు
నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబును జిల్లా పోలీస్ అధికారుల సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు.