శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరురూరల్, మార్చి 25: మనకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నెల్లూరుమండల పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అవసరమున్న చోటల్లా ప్రాజెక్టులు నిర్మించి నీటిని నిలువ చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోందని, ఆదిశగా ప్రాజెక్టులు అన్నీపూర్తిచేయడానికి చంద్రబాబునాయుడు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం నెల్లూరురూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అధికారులు ప్రజాసమస్యలపై స్పందించని పక్షంలో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రజల కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం ఎంతదూరమైనా వెళ్తామని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అనంతరం ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వౌళిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేసిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రెండు సిసి రోడ్లకు ప్రారంభోత్సవం, శివాలయానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆనం జయకుమార్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక నాయకులు పముజుల దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు.