నెల్లూరు

మద్దతు ధర విషయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలదే ప్రధాన భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 17: రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించే విషయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రధాన భూమిక పోషించాలని, వీటి నిర్వహణలో పూర్తి అవగాహన కలిగి పటిష్ఠంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జానకి సూచించారు. గురువారం స్థానిక గోల్డెన్ జూబ్లీ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ సిబ్బందికి రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో ఏర్పాటుచేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలోని రైతులకు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో ధాన్యం కొనుగోలు సిబ్బంది గోనెసంచులు, తూకాలు తదితర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండాలని సూచించారు. అలాగే రైస్‌మిల్లర్ల నుండి బ్యాంకు గ్యారెంటీకి సంబంధించిన విషయాలలో నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు చెల్లింపుల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సాంకేతిక శిక్షకులు శ్రీనివాస్ కేంద్రాల నిర్వహణ, తదితర కొనుగోలు ప్రక్రియలకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కొండయ్య, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లర్ల సంఘానికి చెందిన ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యులు పాల్గొన్నారు.