నెల్లూరు

అదే స్పందన.. అదే సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి17: ఫిర్యాదును సాంతం ఓపిగ్గా వినడం, వెంటనే స్పందించడం, ఆదేశాలు జారీ చేయడం... ఇలా సాగింది గురువారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది తమ సమస్యలను ఎస్పీకి ఫోన్ ద్వారా విన్నవించుకున్నారు. ప్రతిఒక్కరి ఫిర్యాదును పూర్తిగా విని, అంతే ఓపిగ్గా వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్పీ ప్రయత్నించారు. సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీనిస్తూ సంబంధిత ఏరియా డిఎస్పీలకు తగిన ఆదేశాలు కూడా అక్కడికక్కడే జారీ చేశారు. గత వారం వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యలు, పురోగతిని ఆయన సమీక్షించారు. గురువారం వచ్చిన ఫిర్యాదుల్లో నెల్లూరులో గతితప్పిన ట్రాఫిక్ వల్ల తాము పడుతున్న ఇబ్బందులను పలువురు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదులు అందే సమయంలో ఫిర్యాదుదారుడినే ‘నెల్లూరులో ట్రాఫిక్ నియంత్రణకు మీవద్ద ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి’. అంటూ వారి సూచనలను కూడా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అదనపు ఎస్పీలు బి.శరత్‌బాబు, రెడ్డి గంగాధరరావు, డిఎస్పీలు జెవి రాముడు, కోటారెడ్డి, విక్రమ శ్రీనివాసరావు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.