నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అతులతవంబునన్ వరుణు ఁ డన్మునిచే బహుపుణ్యకర్మసు
స్థితి బ్రభవింపగాఁబడిన దివ్య మునీందుఁ డశేష లోక పూ
జితుఁడు వసిష్ఠు డాశ్రమము ఁ జేసి తపం బొనరించి బ్రహ్మస
మ్మితుఁ డురురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్
భావం: వరుణుడు అనే మునికి అపార తపస్సు వలననూ,అనేక పుణ్యకర్మలయొక్క ఫలస్థితి వలననూ పుట్టిన దివ్యమునీంద్రుడు, సర్వలోకాల చేత గౌరవింపబడేవాడు, బ్రహ్మతో సమానుడు అయిన వసిష్ఠ మహర్షి రత్నాలతో వెలుగొందే పెద్దదైన మేరు పర్వత గుహలోపలిభాగాన్ని ఆశ్రమంగా చేసుకొని తపస్సు చేశాడు. అక్కడ దక్షప్రజాపతి కూతురైన సురభికి, కశ్యపునకు జన్మించిన నందిని అనే ధేనువు సహాయంతో వసిష్ఠుడు తనకు ఇష్టమైన కార్యాలన్నీ చేస్తూ ఆశ్రమంలో సుఖ జీవనం సాగిస్తున్నాడు. అపుడు వసువులు వారి భార్యలతో సహా భూలోక విహారానికి వచ్చి ఈ వసిష్ఠుని ఆశ్రమాన్ని చూచారు. అక్కడి నందిని కూడా వారు ఆశ్చర్యంతో చూశారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము