నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనిన విని నగుచు వాఁ డి
ట్లనియె ‘దక్షకుడనేన యశనినిపాతం
బున బ్రదుకఁగ నగు నేనియు
ననఘా! మద్విషనిహతుల కగునే బ్రదుకన్’

భావం: ముసలి వాని రూపంలో తక్షకుడు మంచి భావాలతో వెళ్లే కశ్యపుడను మునిని చేరపిలిచి ఎందుకు, ఎక్కడకు వెళ్తున్నాడో కనుగొన్న తర్వాత నవ్వుతూ తక్షకుడు ఈవిధంగా మాట్లాడుతున్నాడు. ‘ఓ పాపరహితుడా! నేనే ఆ తక్షకుడిని. వజ్రాయుధం యొక్క దెబ్బచేత బ్రతికిన బ్రతుకవచ్చుగాక! నా విషం చేత చంపబడిన వారికి జీవింపశక్యం కాదు.’ నీవు ఏదో బ్రహ్మోపదేశంతో వెళ్లి నీవు వేసే మంత్రతంత్రాలకు నా విషం విరిగిపోతుందా?’ ఏమిటి అంటూ ఎద్దేవా చేస్తూ కశ్యపుని శక్తి సామర్థ్యాలను అడుగుతున్నాడు. కశ్యపుడను ముని ఎంతో ప్రార్థన చేసి బ్రహ్మను మెప్పించి తెచ్చుకున్న మంత్రబలంతోపరీక్షిత్తును రక్షించుదామన్న ఆలోచనతో వెళ్తుంటే మధ్యలో తక్షకుడు నీమంత్రబలమెంత అని అడుగుతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము