నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఘనభుజుఁ డన్నియు నడుమన
తునియఁగ వడినేసి, వాని తురగ చయస్యం
దన సూతుల నొక్కొక య
మ్మున ద్రెళ్లఁగ నేసి భరతముఖ్యుఁడు పోరన్

భావం: గొప్ప భుజాలు కల ఆ భరత కులశ్రేష్ఠుడైన భీష్ముడు యుద్ధంలో సాల్వుడు ప్రయోగించిన బాణాల నన్నింటిని మధ్యలోనే తునిగి పోయేటట్లుగా వేగంగా బాణాలు ప్రయోగించి అతడి గుఱ్ఱాలను, రథాలను, సారథినీ ఒక్కొక్క బాణంతో నేలపై కూలేటట్లుగా చేశాడు. మిక్కిలి ఆశ్చర్యం కలిగించే రీతిలో లక్షల సంఖ్యలో బాణప్రయోగం సాల్వుడు చేయగా ఆ బాణాలన్నింటినీ తన దరికి రాకపూర్వమే మధ్యలోనే భీష్ముడు త్రుంచివేసాడు. ఒక్కొక్క బాణంతోనే రథాన్నీ, సారథిని చంపి ధీరుడు అనిపించుకున్నాడు. సాల్వుడు భీష్ముణ్ణి ఎదిరించి కూడా నిలువలేకపోయాడు. భీష్ముని చేతిలో ఓడిపోయాడు. వికలమైన మనస్సుతో వెనుదిరిగాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము