నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. లాలిత రూప వన విలాస విభాసినలైన యంబికాం
బాలికలన్ వివాహ మయ భారత వంశకరుండు గామ లీ
లాలలితాను భోగ రసలాలసు ఁడై నిజరాజ్య భార చిం
తాలనుఁ డయ్యెఁ గామికి నయంబున నొండు దలంపఁ బోలునే!

భావం: భారత వంశకరుడైన విచిత్ర వీర్యుడు లావణ్యంతో కూడిన రూప వన విలాసాలతో ప్రకాశించ అంబికన, అంబాలికను పెండ్లాడిన మన్మథ లీలలతో కూడిన లలిత భోగానువాల సారాన్ని పొందాలనే విషయాభిలాషతో తన రాజ్య నిర్వహణాభారాన్ని గురించి ఆలోచిం చడంలో ఆసక్తి లేనివాడైనాడు. అంతేకదా కాముకునికి పొందికగా మరొక విషయయాన్ని గురించి ఆలోచించే తీరికెక్కడ కలుగుతుంది? భీష్ముడు అంబ చెప్పిన విషయాన్ని విని ధర్మం తెలిసిన బ్రాహ్మణుల అనుమతితో అంబను సాల్వరాజుకు ఇచ్చేటట్టు పంపివేశాడు. ఆ తరువాత అంబ సోదరీమణులైన కన్యలను విచిత్రవీర్యుడికిచ్చి వివాహం జరిపించాడు. విచిత్ర వీర్యుడు కూడా తాను పెండ్లాడిన వారితో సుఖసంతోషాలతో కాలం గడపసాగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము