నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.


హరికిం బట్టపుదేవి పునె్నముల ప్రోవర్థంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్యకళ్యాణముల్

భావము: శ్రీదేవి దేవాదిదేవుడైన వాసుదేవునకు పట్టపు దేవి, పుణ్యాలదీవి, సిరిసంపదల పెన్నిధి. రేరాజుకు గారాబు చెల్లెలు, వాణితో, శర్వాణితో కూడి క్రీడించే పూబోణి, అరవింద మందిరయైన జవరాలు, అఖిల లోకాలకూ ఆరాధ్యురాలైన ఇల్లాలు. కాంతులీనే ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్య్రాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీమహాలక్ష్మి మాకు నిత్యకల్యాణాలు అనుగ్రహించాలి.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ