నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణ నామంబు బ్ర
త్యహయుం బేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే
దహనుం గప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చే
సి హతక్లేశులు గారు గాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా!
భావము: శ్రీకాళహస్తీశ్వరా! నీ శుభనామము ననుదినము మనన మొననర్చు మంచివారలను గ్రహచారపీడలు, దుశ్శకునములు బాధించగలవా? మిడుతలెన్ని కలిసినను అగ్నిని ఆర్పగలవా? మానవులు నిన్ను పూజించి దుఃఖములనేల తొలగజేసికొనరో? శ్రీకాళహస్తీశ్వరుని సేవ సర్వావస్థలను తొలగించగలదు అనే కిటుకును తెలుసుకోలేక గ్రహదోషాలను, అపశకునాలాను తొలగించుకోవడానికి ఏవేవో పాట్లు పడతాడు. శివనామాన్ని నిరంతరం పలకితే చాలు భవరోగాలు దూరమవుతాయ. భౌతికంగా వచ్చిన రోగాలు కూడా శివనామాన్ని ఉచ్చరించడం వల్ల దరిచేరవు. కాని ఈ విషయాన్ని సామాన్యులు తెలుసుకొనలేక భౌతికమైన ఔషధాలను మరీ మరీ సేవించి ఇన్ని మందులు వేసుకున్నా మా రోగం దూరమవడం లేదు అని బాధపడుతారు. కాని శివనామాన్ని ఒక్కసారి పలికితే సర్వరోగాలు దూరమవుతాయని గ్రహించలేరని కవి ఆవేదన.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శ్తకపద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శ్తకపద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ