నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్న యేనుగు తోలు దుప్పటము బువ్వాకాల కూటంబుచే
గినే్న బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
నిన్నీలాగున మంటయుందెలిసియున్ నీ పాద పద్మంబు సే
ర్చె న్నారాయణుడెట్లు మాన సముదా శ్రీకాళహస్తీశ్వరా!

భావము: శ్రీకాళహస్తీశ్వరా! గజ చర్మము నీ ఉత్తరీయము. కాలకూటము నీ ఆహారము. బ్రహ్మ కపాలము నీ చేతి భిక్షాపాత్ర. సర్పము నీ కంఠహారము. ఇవి అన్నియు జుగుప్సాకరములు. భీకరములును. నీవు ఇట్లుండదువని తెలిసియు శ్రీమన్నారాయణుడు తన మనస్సున నీ పాద పద్మములందు ఎట్టుల ఏల చేర్చెనో తెలియకున్నది.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ