నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకునే
వనజ వనీవిహార కలనంబు దొలగగ జేయుగాని గుం
భనమున దుగ్ధజీవన విధాన నిరూఢ నైపుణీ
జనిత మహాయశో భవసారము హంసకు మాన్పజాలునే.
భావము: బ్రహ్మదేవునికి తన వాహనమైన హంస మీద కోపం వస్తే దానిని తామర వనంలో విహరించకుండా చేయగలడే కానీ దానికి పాలనూ, నీటినీ వేరుచేయడంలో గల నైపుణ్యంవలన కలిగిన గొప్ప కీర్తి వైభవాన్ని మాత్రం మాన్పగలడా? అని అర్థం. సృష్టికర్త, సర్వసమర్ధుడు అయిన బ్రహ్మదేవుడంతటి వానికే కోపం వచ్చినా హంస లోని నైపుణ్యాన్ని ఏమీ చేయజాలనట్లే సామాన్య ప్రభువులు పండితుల పాండిత్యాన్ని ఏమిచేయగలరని కవి ప్రశ్నిస్తున్నాడు.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిథి.- కె. లక్ష్మీఅన్నపూర్ణ