నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ . తన విషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁడెట్లు దహించె నట్లయే
నును సహ మిత్ర బాణధవ జనుండగు తక్షకు నుగ్రహవ్యవా
హన శిఖలన్ దహించి, దివిజాధిపలోకనివాసుఁడైన మ
జ్ఞానకున కీయుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసిదన్

భావం: తక్షకుడు తన విషాగ్ని చేత నా తండ్రిని ఎట్లా కాల్చివేశాడో, ఆవిధంగానే మిత్రులతోను, బంధుజనాలతోను కూడిన తక్షకుడిని భయంకరమైన అగ్ని జ్వాలలలో కాల్చి స్వర్గస్థుడైన నా తండ్రికిని, ఈ ఉదంకుడనే బ్రాహ్మణుడికి, సజ్జనులకు అభిమతమయ్యేటట్లుగా ప్రీతి కలిగిస్తాను. తన పూర్వుల చరిత్ర నంతా విన్న జనమేజయుడు మిక్కిలి కోపావేశుడయ్యాడు. తాను కూడా ఏదైనా యాగం చేసి ఆ తక్షకుని లాంటి పాములకు బుద్ధి చెప్పాలని అనుకొన్నాడు. ఆవిషయం అంతా మంత్రిపురోహితులు బ్రాహ్మణులను పిలిపించారు. వచ్చిన బ్రాహ్మణులతో జనమేజయుడు తక్షకుడు మా తండ్రిని కాల్చివేసినట్లుగా నేను కూడా సర్పయాగం చేసి ఆ అగ్ని జ్వాలల్లో తక్షకుడి లాంటి పాములను చంపివేసి స్వర్గస్థుడైన నా తండ్రికి, ఇతర సజ్జనులందరికీ ఆమోదయోగ్యమయ్యేట్లుగా సర్పయాగం చేయవచ్చునా అని అడిగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము