నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యతి సంగంబున, బాలుడాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే
శ్రుతిహనిన్ ద్విజుడన్వయంబు ఖలుచే, గ్రూరాప్తిచే శీల, ము
ద్ధతిచే మిత్రత, చూపులేమి కృషి, మద్యప్రాప్తిచే సిగ్గు, దు
ర్మతిచే సంపదలున్ నశించు, చెడు నర్థంబుల్ ప్రమాదంబునన్.

భావము: సాంగత్యంవల్ల సన్యాసి, లాలనవల్ల కుమారుడు, చెడ్డ మంత్రివల్ల రాజు, వేదాధ్యయనం లేకపోవడంవల్ల బ్రాహ్మణుడు, కుపుత్రునివల్ల వంశం, దుర్మార్గులను చేరడంవల్ల శీలం, గర్వంవల్ల స్నేహం, తఱచుగా చూడకపోవడంవల్ల, పట్టించుకోకపోవడంవల్ల వ్యవసాయం, మద్య సేవనంవల్ల సిగ్గు, చెడుబుద్ధులవల్ల సంపదలు, పరాకువల్ల ధనం నశిస్తాయి.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ