నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ కర్యాంబు బరిత్యజించియు, మరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం
గము గావించెడు వార లెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్

భావము: తమ పనులను కూడా విడిచి ఇతరుల కార్యాలను చేసేవారు సత్పురుషులు, తమ కార్యాలకు భంగం లేకుండా ఇతరుల కార్యాలను చేసి పెట్టేవారు. మధ్యములు, తమ కార్యం కోసమై పరుల కార్యాలను చెడగొట్టేవారు మనుషులలో రాక్షసులు. తమకు ఏ మాత్రం ప్రయోజనం లేకున్నా పరుల కార్యాలను చెడగొట్టేవారిని ఏ పేరుతో వ్యవహరించాలో చెప్పలేము.

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ