నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్
భూప సభాంతరాళమున ఋష్కల వాక్చతురత్వ మాజి బా
హా పటుశక్తియున్, యశము నందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్, బ్రకృతిసిద్ధ గుణబులు సజ్జనాళికిన్

భావము: ఆపదలు వచ్చినపుడు ధైర్యగుణం, ఐశ్వర్యంవచ్చినపుడు ఓర్పు, రాజసభలో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తియందు ఆసక్తి, విద్యార్జనయందు కోరిక- ఈగుణాలన్నీ సజ్జనులకు సహజసిద్ధంగా వుండే గుణాలు. అందువలన సజ్జనులు ఎన్ని ఆపదలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోరు. సంపద ఎంతవచ్చినా గర్వితులు కాకండ ఓరిమితో వుంటారు. సభల్లో వాక్చాతుర్యాన్ని కలిగివుంటారు. యుద్ధంలో శౌర్యాన్ని ప్రదర్శిస్తారు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ