నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు, నా
నీరమె శక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభం బౌ
రుషవృత్తులిట్ల ధనము మధ్యము నుత్తముగొల్చువారికిన్

భావము: కాలిన ఇనుముపై పడిన నీరు ఊరు పేరు లేకుండా నశించిపోతుంది. ఆ బిందువు తామరాకుమీద పడినపుడు ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఆ బిందువే ముత్యపు చిప్పలోపడి చక్కని కాంతివంతమైన ముత్యంలా మారుతుంది. కనుక ఆశ్రయానుసారంగా నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వస్తుంది. నీచుల నాశ్రయించిన సమస్తాన్నీ కోల్పోతారు. మధ్యముల నాశ్రయించినవారు ప్రభావితులు కాలేరు. ఉత్తముల నాశ్రయించినవారికి సౌఖ్యాలు కలుగుతాయి.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ