నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనకుని పూజలం గడు ప్రసన్నుని జేయునతండు పుత్రుడే
వనిత మెలంగు భర్తృవశవర్తిని యై యది సత్కళత్ర యే
జనుడు విపత్తి సౌఖ్య సదృశ క్రియుడాతడు మిత్రుడీత్రయం
బును జగతిన్ లభించు గడు పుణ్యము జేసినయట్టి వారికిన్

భావము:ఎవడు తన మంచి నడవడిచేత తండ్రిని సంతోషపెడతాడో వాడే నిజమైన పుత్రుడు. ఏ స్ర్తి భర్తకు అజ్ఞావర్తినియై ఉంటుందో ఆమెయే మంచి భార్య. ఎవడు ఆపత్సమయాల్లోను, దుఃఖ సమయాలలోను తగిన విధంగా ప్రవర్తిస్తాడో అతడే మంచి మిత్రుడు. ఇటువంటి పుత్రుడు భార్య, స్నేహితుడు ఎంతో పుణ్యం చేసుకున్నవారికి మాత్రమే లభిస్తారు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ