నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదలజూచిన గడుగొప్ప పిదప గుఱచ
యాది కొంచెము తర్వాత నధికమగుచు
దనరు, దివపూర్వ పర భాగ జనితమైన
చాయపోలిన .... సజ్జనురి మైత్రి

ప్రొద్దున పూట నీడ మొదట్లో పొడుగ్గా వుంటుంది. ఆ తరువాత పొద్దెక్కుతున్న కొద్దీ కుఱచగా అవుతుంది. దుర్మార్గులతో స్నేహం కూడా మొదట్లో అధికంగా వుండి ఆ తరువాత క్రమక్రమంగా తగ్గిపోతూ వుంటుంది. సాయంకాలపు నీడ మొదట చిన్నగా వుంటుంది. ఆ తరువాత పొద్దు తగ్గుతున్నకొద్దీ పొడుగ్గా ఎదుగుతుంది. అలాగే సజ్జనులతోడి స్నేహం మొదట్లో కొద్దిపాటిగా వుంటుంది. ఆ తరువాత స్నేహం క్రమక్రమంగా దృఢపడి వృద్ధి పొందుతూ వుంటుంది. కనుక బుద్ధిమంతుడై ఈ రెండింటినీ బాగా ఆలోచించి యుక్తమైనదానిని ఆచరించాలి.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ