నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో
విను మరుభూమి కేగిన లభించును మేరువు చేరబోయినన్
ధనమధికంబు రాదు కడు దైన్యము మాను ధనాఢ్యులందు న
వ్వన నిధి నూత తుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా!

భావము: బ్రహ్మదేవుడు తన నొసట వ్రాసిన ధనం, కొద్దోగొప్పో మానవుడు ఎడారి ప్రాంతంలో వున్నా లభిస్తుంది. మేరు పర్వతంపైన వున్నా బ్రహ్మదేవుడు నొసట వ్రాసినదానికన్నా ఎక్కువ లభించదు.కనుక ధనవంతులను చూసి దైన్యాన్ని పొందడం కూడదు. కుండను సముద్రంలో ముంచినా, బావిలో ముంచినా అది నీటిని సమానంగానే గ్రహిస్తుంది కదా! మానవుడు మాత్సర్యాన్ని కలిగి వుండకూడదనే నీతి దీని ద్వారా వెల్లడి అవుతున్నది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ