నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనము చేత మూగయు, సమంచితవక్త ప్రలాపి, చెంగటం
బూని వసింప దిట్ట, దమముందట దవ్వుగ నుండెనేని శా
లీనుడు, దాల్మి భీరు, డవలిప్తుడు దాలిమిలేని బంటు, భూ
జానుల సేవ దుష్కరమసాధ్యము యోగులకైన సిద్ధరన్

భావము: సేవకుడు ఏమీ మాట్లాడకుండా వుంటే మూగవాడని అంటారు. నేర్పుతో మాట్లాడితే అసంబద్ధ ప్రలాపి అని ఈసడిస్తారు. దగ్గరగా చేరుకుంటే భయభక్తులు లేనివాడని కసరుకుంటారు. దూరంగా వుంటే చేతకానివానిగా భావిస్తారు. ఓర్పుని కలిగి ప్రవర్తిస్తే పిరికివాడని తలుస్తారు. ఓర్పు లేకపోతే గర్విష్ఠి అని మందలిస్తారు. కనుక సేవకుడు రాజు దగ్గర ఏ విధంగా ప్రవర్తించినా రాజులు సంతృప్తిపడక తప్పుపడుతూనే వుంటారు. రాజు సేవ కత్తిమీద సాములాంటిది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ