మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వితత జగద్భరంబు దనవీపున దాల్చిన కూర్మనాథుడున్
సతతము చంద్ర భాస్కరుల చక్రము ద్రిప్పు ధ్రువుండు సజ్జనుల్
ప్రతిభ నజాండి జంతు ఫల రంధ్ర వసన్మశకంబులట్ల నిం
దిత విఫలార్థ సంగతి జనించి నశించు దదన్య జంతువుల్

భావము: విస్తారమైన లోకభారాన్ని తనవీపున ధరించిన ఆదికూర్మం, ఎల్లప్పుడూ సూర్యచంద్రులచే జ్యోతిశ్చక్రాన్ని తిప్పే ధ్రువుడు, ఈ ఇద్దరే లోకంలో సజ్జనులు. తక్కిన ప్రాణులన్నీ పరోపకారం చేయజాలని వారు కావడంచేత బ్రహ్మాండమనే అత్తిపండులోని రంధ్రాలలో ఉండే పురుగులవలె పుడుతూ, నశిస్తూ ఉంటారు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ