నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.

భావము:అధములైనవారు విఘ్నాలు వస్తాయన్న భయంతో అసలు పనులనే ప్రారంభించరు. మధ్యములు పనులు ప్రారంభించి విఘ్నాలు రాగానే వాటిని వదిలిపెడతారు. ధీరులైన వారు మాత్రం ఎన్ని విఘ్నాల తాకిడి కలిగినా ప్రజ్ఞానిధులు కనుక ధైర్యంతో ఉత్సాహాన్ని పెంపొందించుకొని ప్రారంభించిన పనులను వదలిపెట్టరు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ