నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర ఖర్వాటు డొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై
త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ దాళద్రువచ్ఛాయద
చ్ఛిరముం దత్ఫల పాత వేగమున్ విచ్చెన్ శబ్ద యోగంబుగా
బొరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్

భావము: బట్టతలవాడొకడు మధ్యాహ్న సమయంలో సూర్యుని కిరణముల వేడికి తాళజాలక నీడగల ప్రదేశాన్ని కోరి తాటి చెట్టు క్రిందకు వెళ్ళాడు. అప్పుడే దైవికముగా ఆ చెట్టునుండి తాటిపండు ఒకటి వేగంగా వచ్చి అతని తలమీద పడింది. వాని తల పట పటమని బ్రద్దలయిపోయింది. దైవబలం తక్కువగా వున్నవాడు ఎక్కడికి పోయినా అక్కడికే ఆపదలు పోతాయి.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ