నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సలిలము జొచ్చినం, గనక శైలము జేరిన, వైరి వీరులం
గెలిచిన, రాజసేవ తిలకించిన, వేదములభ్యించినం
గళల లెఱంగెఱింగిన, ఖగత్వము దాల్చిన, గర్మ నిఘ్నతా
కలన నభావ్యమన పనిగాదు వినాశము లేదు భావికిన్

భావము: జల స్తంభాదులచే నీటిలో మునగడం, యోగానుసంధానాదుల చేత మేరు పర్వతాన్ని చేరుకోవడం, బల పరాక్రమాదులచే శత్రు వీరులను జయించడం, రాజుల కొలువు సంపాదించడం, వేదాది విద్యలు నేర్వడం, చతుష్షష్ఠి కళలను అభ్యసించడం, పాదుకా సిద్ధి చేత పక్షివలె ఆకాశంలో తిరగడం, మొదలైనవాటిని ఎన్నింటిని మానవుడు నేర్చినా అదృష్టం లేనిదే ఏ మాత్రం ఫలితం కలుగదు. అదృష్టమొక్కటే ఉన్నట్లయి వీటికి ఫలితం కలగనీయకుండా అడ్డుపడడం ఎవరికీ సాధ్యం కాదు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ