నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అభిమన్యునకు విరాటాత్మజ యైన యుత్తరకును బుట్టిన ధర్మమూర్తి
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి ప్రథఁబరీక్షితుఁడు నాఁ బరఁగువాఁడు
ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ బూని భూప్రజ నెల్లఁ బుణ్య చరిత
ననఘుఁడై రక్షించి యఱువది యేఁడులు రాజ్యంబు సేసిన రాజవృషభుఁ

అ. డధిక ధర్మమార్గుఁడైన నీయట్టి స త్పుత్త్రుఁబడిసియున్న పుణ్యుఁ డన్య
నాథ మకుట మణిగణప్రభారంజిత పాదపంకజుండు భరత నిభుడు

భావం: అభిమన్యుడికి విరాటుని కూతురైన ఉత్తరకు జన్మించిన ధర్మస్వరూపుడు. కౌరవవంశం వినాశం పొందే సమయంలో పుట్టి ప్రసిద్ధిచే పరీక్షితుడు అనగా ఒప్పేవాడు. ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించక అనుసరిస్తూ యత్నించి భూమిలోని ప్రజలను అందరిని పవిత్ర మయిన చరిత్రంతో పాపరహితుడై కాపాడి అరవై సంవత్సరాలు రాజ్యం పాలించిన రాజశ్రేష్ఠుడు ధర్మతత్పరుడై నీవంటి మంచికుమారుడిని పొందిన పవిత్రుడు. భరతునితో సమానుడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము