నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
లలితనికేతన ప్రియ విలాసవతీ ధవళాత పత్రస
ద్ద్విలసిత వైభవంబనుభవింపబడున్ సుకృతాను వృత్తిచే
జెలువగు పుణ్యకర్మము నశించిన నంగజ సంగరత్రుట
త్కలిత గుణోరు వౌక్తిక నికాయములట్లు దొలంగు సంపదల్
భావము:పూర్వజన్మంలో సత్కర్మలను ఆచరిస్తే వాటి ఫలితంగా మానవుడు ఈ జన్మలో మంచి మంచి మేడలు, విలాసవతులైన యువతులు, ఏకచ్ఛత్రాధిపత్యం కలిగిన రాజ్యం మొదలైన ఎన్నో వైభవాలు అనుభవించవచ్చు. సత్కర్మల ఫలం నశిస్తే ఆ మేడలు మొదలైన సకల సంపదలూ తెగిపోయిన ముత్యాల పేరులోని ముత్యాలు చెల్లాచెదరైపడిపోయినట్లుగా చెదరిపోతాయి.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ