నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్
శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ నభిజిత్సం జ్ఞాతలగ్నంబునన్
భువనాధీశుడు పుట్టె వామనగతిం పుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమ పాతివ్రత్య విఖ్యాతకున్

భావము: బ్రహ్మదేవుడు మహానుభావుడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేశాడు. అపుడు శ్రావణమాసంలో ద్వాదశి తిథినాడు, శ్రవణా నక్షత్రంలో, అభిజిత్ లగ్నంలో పట్టపగలు సూర్యుడు ఆకాశంలో నట్టనడుమ ప్రకాశిస్తున్న సమయంలో, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడూ ఉచ్చదశలో ఉన్న సమయంలో నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా ఖ్యాతిగాంచిన దేవమాత అదితి గర్భం నుండి వామన రూపంలో మహావిష్ణువు జన్మించాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ