నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతం బాసిరి యక్ష తార్ఖ్య సుమనస్సిద్ధోరగా దీశ్వరుల్
సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్
గాంతిం చెందిరి భాను చంద్రములు, రంగద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటకింపురుషులున్ గంధర్వలున్ కిన్నరుల్

భావము: వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు, చింతలు విడిచినారు. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేసినారు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ