మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మహానుభావుడెట్లింత కాలంబు
నుదరమందు నిలిచి యుండె ననుచు
నదితి వెఱగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె
భావము: వామనుని జనన సమయంలో దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. తరువాత అదితి వామనుని చూసి ‘‘ఈ మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా వున్నాడా?’’ అని ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన ‘జయ జయ’ శబ్దాలతో కశ్యపుడు స్వామిని సంస్తుతించాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ