నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ
సత్యగతులు వృద్ధ సమ్మతంబు
లడుగదలచి కొంచెమడిగితివో చెల్ల!
దాత పెంపు సొంపు దలపవలదె

భావము: బలిచక్రవర్తి వామనునితో ‘‘ఓ బ్రాహ్మణుడా! నీవు అన్న మాటలన్నీ ఉన్నమాటలే. వాటని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం! అడిగి అడిగీ కొంచెమే అడిగావు. చాలా బాగుంది! కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్నీ, అతని సంతోషాన్నీ తలంచవద్దా! అని పలికాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ