మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశాపాశము దా గడున్నిడువు లేదంతంబు రాజేంద్ర! వా
రావి ప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరిగాక భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయగ నేర్చెరే మును నిజాశాంతంబులం జూచిరే
భావము: ఓ రాక్షస రాజేంద్రా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతులేదు. పూర్వకాలంలో ప్రృథ చక్రవర్తీ, గయుడూ మొదలైన రాజులు సముద్రాలదాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించినారు. వారు సైతం వృధాగా కష్టపడినవారే కానీ అర్థంపైనా, కామంపైనా ఆశలు వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ