నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరక వచ్చు బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగ గల్గువానికి ప్రయాసము నొందిన దేవదానవుల్
వారటులుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గె గాదె శృం
గారపు బ్రోవు లక్ష్మియును గౌస్త్భురత్నము రెండు భాస్కరా!

భావము: భాస్కరా! అదృష్టం బాగా వున్న వ్యక్తికి కష్టపడకున్నా ఫలితం కలుగుతుంది. అమృతం కోసం కష్టపడ్డ దేవతలూ, రాక్షసులూ ప్రక్కన వుండగనే నడుమ వచ్చిన అదృష్టవంతుడైన విష్ణువునకు అప్రయత్నంగా అనాయాసంగా సౌందర్యరాశి అయిన లక్ష్మి, కౌస్త్భుమణీ రెండూ లభించాయి కదా!

భాస్కర శతకములోని పద్యము