నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన కవి శాల చేల, భవకానన శాతకుఠార ధార స
జ్జన పరిపాలశీల, దివిజస్తుత సద్గుణకాండ, కాండసం
జనిత పరాక్రమ క్రమ విశారద, శారద కంద కుంద చం
దన ఘనసార సార యశ, దాశరధీ కరుణాపయోనిధీ!

భావము:విస్తృతమైన జలతారు వస్తమ్రును గట్టి, వాడియైన గొడ్డలి చేత అడవిని నరుకునట్లుగా, జన్మబంధాలను, సంసార బంధాలను నాశనం చేసి సత్పురుషులను, మంచి నడవడిక కలవారిని పరిపాలించేవాడవు, దేవతల చేత పొగడబడిన మంచి గుణములు కలవాడవు అస్త్ర విద్య చేత పరాక్రమ పద్ధతిని, నేర్పు కలవాడవు. శరత్కాలమందలి మేఘమువలెను, మల్లెపూవుల వలెను, మంచి గంధము వలెను, పచ్చ కర్పూరము వలెను శ్రేష్ఠమైన తెల్లని కీర్తి కలవాడవు. దయా సముద్రుడవైన దశరథరామా!

దాశరథీ శతకములోని పద్యము