నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురితలతాల విత్ర, ఖర దూషణ కాననవీతి హోత్ర, భూ
భరణ కళా విచిత్ర, భవబంధ విమోచనసూత్ర, చారు వి
స్ఫుర దరవింద నేత్ర, ఘనపుణ్య చరిత్ర, వినీల భూరికం
ధర సమగాత్ర, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము:తీగలవంటి పాప సంచయాన్ని కొడవలి వలె నరకివేసేవాడును, అగ్ని దట్టమైన అడవిని కాల్చివేసినట్లుగా ఖరదూషణలను నాశనం చేసిన వాడును, నానా విధముల లీలల చేత భూభాగాన్ని అద్భుతంగా వహించినవాడును, భక్తులకు కలిగిన జన్మ పరంపరలనుండి విముక్తి కలిగించేవాడును, సుందరమైన పద్మాల్లాంటి సోగకన్నులు కలవాడును, మిక్కిలి పావనమైన నడవడియందు ప్రవర్తిల్లినవాడును, మబ్బువంటి సుందరమైన నల్లని శరీర వర్ణం కలిగినవాడును, భద్రగిరిలో నివసించేవాడును నైన శ్రీదశరధరామా!