నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమ దయానిధే! పతిత పావన నామ హరే యటంచు సు
స్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాద ధూళి నా
శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట, దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము:దయాగుణానికి పాతర వంటి ఓ దశరథరామా! అడుగున పడిన పాపాత్ములను ఉద్ధరించి పవిత్రులను చేసే ప్రఖ్యాతిని కలిగిన రామా! అచంచలత్వము లేని మనస్సు కలవారలు, నన్ను భజించు మహనీయుల పాద ధూళిని నా తలపై ధరింతును. దానివలన మీకు అట్టివారి వద్దకు వెళ్ళవద్దని మృత్యుదేవత అయిన యముడు తన సేవకులను ఆజ్ఞాపిస్తాడని చెప్పుదురు. అనగా విష్ణునామ సంకీర్తన చేసేవారిని స్మరించి వారి పాదాలకు నమస్కరించేవారిని సమీపించడానికి మృత్యువు కూడా భయపడుతుందని కవి భావము.

దాశరథీ శతకములోని పద్యము