మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలికునకున్ హలాగ్రమున నర్ధము చేకురు భంగి, దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు, దు
ర్మలిన మనో వికారినగు మర్త్యుని నన్నొడ గూర్చి నీపయిన్
దలపు ఘటింప జేసితిని దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దయాసముద్రుడవైన దశరథరామా! మడి దున్నుకొని జీవితము గడిపే కర్షకునికి, నాగలి కొర్రకు ధనరాశి తగిలి లభించిన విధంగాను, దాహంతో అలసట చెంది బాధలో ఉన్నవానికి గంగానదిలోని నీరు దొరికినట్లుగాను , మాలిన్యము కలిగి దోషభూయిష్టమైన మనస్సు కలిగిన మానవుడనైన నన్ను చక్కచేసి, నీపయి మనస్సు కలిగించి భక్తి కలిగించి ధన్యుని చేసితివి కదా.

దాశరథీ శతకములోని పద్యము