మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెరమాని వేము దినఁ జాలి న కైవడి, మానవాధముల్
పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చె దరట్ల కాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్క వలె ; మొక్షమొసంగిన నీవ రుూ వలెన్
దక్కిన మాట లేమిటికి, దాశరథీ కరుణాపయోనిధీ

భావం: మానవులలో హీనులైనవారు, శ్రీరాముడవైన నిన్ను వదిలి క్షుద్రదేవతలను అనేకులైన వారిని సేవిస్తారు. ఇది ఎట్లున్నదంటే తీయని రుచి కలిగిన చక్కెరను వదిలిపెట్టి చేదు పదార్థమును తినునట్టిదే. కాని ఇది సరియైన పద్ధతి కాదు. దైవంగా భావించి నీకే నమస్కారం చేయవలె . ముక్తిని కైవల్యాన్ని ప్రసాదించేవాడవునీవే.

దాశరథీ శతకములోని పద్యము