నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల నిధి లో దూటి, కులశైలముమీటి, ధరిత్రిఁగొమ్ము నం
దల వడమాటి, రక్కసుని యంగము గీటి, బలీంద్రునిన్ రసా
తమున మాటి, పార్థివ కదంబము గూల్చిన మేటి రామా, నా
తలఁపున నాటి రాఁ గదవె దాశరథీ కరుణాపయోనిధీ
భావం: ఓ దశరథ రామా , నీవు మత్స్యమువై వేదాలనుద్ధరించడానికి సోమకాసురుని సంహరించడానికి సముద్ర గర్భంలో ప్రవేశించినావు. కూర్మముగా మారి మందర పర్వతాన్ని పాలసముద్రంలో మునిగి దాన్ని ఎత్తి నిలిపినావు. వరాహరూపాన్ని ధరించి ప్రళయజలంలో మునిగిన భూమిని కోరకొమ్మున నెత్తికొని వచ్చినావు. ఉద్ధరించినావు, నరసింహుడవైనీ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్య కశిపుని దేహమును చీల్చినావు. వామనుడవై బలిచక్రవర్తి పాతాళమునకు అణగద్రొక్కినావు. పరశురాముడవుగా రాజసమూహాన్ని సంహరించినావు. అట్టి నీవు నా మనస్సులో స్థిరముగా నిలిచి ఉండుమా.

దాశరథీ శతకములోని పద్యము